Back

సాధనాశిబిరం - పేకేరు


District:  
West Godavari
Samithi:
Pekeru
No Of Beneficiaries:
128
Event Date:
03-Sep-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
No Of Hours:
05:30:00
Location:
Sri Satyasai Seva Samithi, Pekeru
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరామ్

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పశ్చిమగోదావరి జిల్లా పేకేరు లో సాధనాశిబిరం -

 

ది. 03-09-2023 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 03-09-2023వ తేదీన తణుకు subzone పరిధి లో శ్రీ సత్యసాయి సేవా సమితి, పేకేరు, పశ్చిమగోదావరి జిల్లాలో సాధనాశిబిరం నిర్వహించుట జరిగినది. జ్యోతి ప్రజ్వలన చేసిన తదుపరి వేద పఠనము తో కార్యక్రమం ప్రారంభించుట జరిగినది.

 

శ్రీ పాండురాజు గారు సాధనా శిబిరంనకు విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికి ఆహ్వానించుట జరిగినది. జిల్లా సాధనాశిబిరం కోఆర్డినేటర్. శ్రీ గాదె శ్రీరామ చంద్రమూర్తి గారు సభకు అధ్యక్షత వహించుట జరిగినది. జిల్లా అధ్యక్షులు

 

శ్రీ K.రవీంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క విశిష్టతను తెలియచేస్తూ సత్యసాయి కార్యక్రమాలలో భక్తులు అధికంగా పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ సి వి సూర్యనారాయణమూర్తి గారు ఓంకారము, సుప్రభాతం, నగర సంకీర్తన మరియు జ్యోతి ధ్యానము ల విశిష్టతను వివరించారు. శ్రీ వి ఉదయభాస్కర్ గారు నామసంకీర్తన, సేవ మరియు లిఖిత నామ జపము గురించి క్లుప్తంగా వివరించారు. శ్రీ టి.శోభనాద్రి రావు గారు ఆధ్యాత్మిక సాధన, సాయి సందేశ వ్యాప్తి, సంస్థ సేవలను విస్తృతం చెయ్యాలని చెప్పారు. జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి గౌరికవిత గారు సత్యసాయి సంస్థలలో యువత - భాధ్యతలు - నిర్వహణ మరియు సాయి సాహిత్య పఠనం గురించి మాట్లాడారు. జిల్లా సాధనాశిబిరం కోఆర్డినేటర్ శ్రీ గాదె శ్రీ రామచంద్రమూర్తి గారు శ్రీ సత్యసాయి బాబా వారి అవతార వైభవం గురించి వివరించుట జరిగినది.

తదనంతరం స్వామి వారికి మహా మంగళ హారతి తో కార్యక్రమం ముగిసింది.

 

ఈ కార్యక్రమంలో 128 మంది భక్తులు పాల్గొనుట జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా 500 మంది స్వామి వారి ప్రసాదం స్వీకరించుట జరిగినది.

 

జై సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved